చదువుకు వయస్సుతో సంబంధం లేదు.. చదవాలన్న తపన ఉంటే చాలు. ఆ తపన, పట్టుదల ఉన్న వ్యక్తి 60 ఏళ్ల వయస్సులో టెన్త్ పాసయ్యాడు. చిన్నప్పుడు చదవాలన్న ఆశ ఉన్నా పరిస్థితులు కలిసిరాలేదు. 60 ఏళ్ల వయస్సులో అవకాశం రావడంతో పట్టుబట్టి చదివి పదోతరగతి పాసయ్యాడు. చదవులో నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం గ్రామ సర్పంచ్ కెతావత్ కన్నిరాంకు చిన్నప్పుడు చదువుకోవాలని ఆశ ఉండేది. కానీ ఇంట్లో పరిస్థితుల కారణంగా అది కుదరలేదు. ఆ తర్వాత చదువుకోవాలన్న ఆశ ఉన్నా ఆ వైపు వెళ్లలేదు. అయితే 60 ఏళ్ల వయస్సులో ఆయనకు చదువుకునే అవకాశం వచ్చింది. చదువుపై ఆసక్తితో రుద్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ చదివి పాస్ అయ్యారు. 60ఏళ్ల వయస్సులో టెన్త్ పాసవడంతో కన్నిరాంను అందరూ అభినందిస్తున్నారు.