ఆసిఫాబాద్ అడవుల్లో వింత మొక్క.. సోషల్ మీడియాలో వైరల్

Update: 2023-07-25 11:24 GMT

అడవి తల్లి అందాలకు పుట్టినిల్లు మన కొమురంభీమ్ ఆసిఫాబాద్. చుట్టు కొండలు, పచ్చని అడవి.. వాటి మధ్య నుంచి పారే సెలయేళ్లు, జలపాతాలు.. వీటన్నింటినీ ఒకే చోట చూడాలంటే ఆసిఫాబాద్ అడవులకు వెళ్లాల్సిందే. ప్రకృతి అందాలని చూస్తూ, హాయిగా సేదతీరాలి అనుకునేవాళ్లకు ఈ ప్లేస్ బెస్ట్ ఛాయిస్. నేచర్ ఫొటోగ్రఫీ లవర్స్, టూరిస్ట్ ల ఫేవరెట్ లిస్ట్ ఒక్కటిగా మారుతుంది. ఎన్నో అరుదైన మొక్కలు, పక్షి జాతులకు కేరాఫ్ ఈ అడవులు. అయితే, తాజాగా మరో అరుదైన రకం మొక్క చోటు దక్కించుకుంది.

తాజాగా.. కాగజ్నగర్ అడవుల్లో అరుదైన పుట్టగొడుగులను కనుగొన్నారు. అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీ శాఖ సిబ్భందికి నీలి రంగు పుట్టగొడుగులు కనిపించాయి. గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో.. ఈ పుట్టగొడుగులు మొలకెత్తినట్లు చెప్పున్నారు. దీన్నే స్కై బ్లూ మష్రూమ్ లేదా ఆల్ బ్లూ మష్రూమ్ అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన రకం పుట్టగొడుగులు కేవలం న్యూజిలాండ్ అడవుల్లోనే కనిపిస్తాయి. అంతేకాకుండా న్యూజిల్యాండ్ కరెన్సీపై కూడా వీటి ఫొటోలు చూడొచ్చు. ఈ రకం పుట్టగొడుగులు మన దేశంలో మొదటిసారిగా 1989లో ఒడిశా రాష్ట్రంలో గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే, వీటిని తినొచ్చా లేదా, ఫస్ట్ ఐడ్ గా ఉపయోగిస్తారా అనే విషయంలో మాత్రం ఫారెస్ట్ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.

https://twitter.com/pargaien/status/1682376166836166658?s=20

A rare mushroom was found in the forests of Asifabad

Asifabad, kagaznagat forest, rare mushroom, blue mushroom, all blue mushroom, Asifabad forest department, Blue Pinkgill mushroom

Tags:    

Similar News