టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో ప్రేక్షకుల మనస్సులను దోచుకున్న ఈమె హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో నిత్యం టచ్లో ఉంటుంది. ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్లు కొత్త చర్చలకు దారితీస్తాయి. అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఉంటాయి. ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ కావడం విశేషం.
ఇవాళ గురిపూర్ణిమ సందర్భంగా ఆమె షేర్ చేసిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘’ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను.. ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవద్ద. స్టేజ్ మీద నీతులు చెప్పి జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు’’ అనే స్టోరీని షేర్ చేసింది. ఈ స్టోరీ వైరల్గా మారగా.. దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆమె ఎవరినీ ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందనేది క్లారిటీ లేదు.