మోకాళ్ల లోతు నీటిలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు.. ప్రయాణికుల ఆగ్రహం

Update: 2023-07-23 09:32 GMT

భారీ వర్షాల కురుస్తుండడంతో గుజరాత్ అతలాకుతలమైంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షానికి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నీట మునిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాని సొంత రాష్ట్రంలో ఎయిర్ పోర్ట్ నిర్వాహణ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకులతో సహా పలువురు నెటిజన్లు విమానాశ్రయం వరదల్లో మునిగిపోయిందని, రన్‌వేలు, టెర్మినల్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయని అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ వెలుపల రోడ్డు నీటమునిగింది. భారీవర్షాలు, వరదల వల్ల విమానాల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త దీపక్ ఖత్రీ అహ్మదాబాద్ విమానాశ్రయం టెర్మినల్ వెలుపల నీటిలో నిండిన రహదారి వీడియోను షేర్ చేశారు.

భారీ వర్షాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. జునాగఢ్ జిల్లాలో భారీ వరద ప్రవాహంలో కార్లు, పశువులు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో కారు కోసం వెళ్లి కుటుంబ సభ్యుల కళ్ళ ముందే వరదల్లో కొట్టుకుపోయాడు. మరోవైపు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాగా, గుజరాత్ లో భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This is the situation of Ahmedabad airport, #Gujarat after 28 years of BJP rule.

Tags:    

Similar News