గ్రామస్థులపై దాడి చేసిన ఏలియన్స్.. ముఖాలను కొరికి తినేశాయట

Update: 2023-08-14 08:46 GMT

ఏలియన్స్.. .ఇవి ఉన్నాయో లేవో అన్న కన్ఫ్యూజన్ ఇప్పటిది కాదు. కొన్నేళ్ల నుంచి ఎంతోమంది సైంటిస్టులను వేధిస్తున్న ప్రశ్న ఇది. గ్రహాంతర వాసులు ఉన్నారని, వారు భూమి మీదకు వచ్చారని అప్పుడప్పుడు కొన్ని సంఘటనల ద్వారా అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. వీటి ఆధారంగానే చాలామంది ఫిల్మ్ మేకర్స్, రచయితలు.. ఏలియన్లు ఉంటే ఎలా ఉంటాయో క్రియేటివిటీతో చూపించారు. ఏలియన్స్ కు సంబంధించిన ఏ వార్త వచ్చినా.. జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. తాజాగా అలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏలియన్స్ కనిపించడమే కాదు.. అవి వాళ్లని కొరుక్కుతిన్నాయని .. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లాటిన్ అమెరికన్ దేశమైన పెరూలో ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి గ్రామస్థులు చెబుతున్నారు. ఏలియన్స్ తమపై దాడి చేశాయని, కొంత మంది ముఖాలను తినేశాయని అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు కానీ .. వారి ప్రకటనతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అంతే కాదు. ఆ గ్రహాంతర వాసులు 7 అడుగుల ఎత్తు ఉన్నారని, ఉన్నట్టుండి తమపై దాడి చేశాయని అంటున్నారు. ఇందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ.. కొన్ని ఫొటోలు చూపిస్తున్నారు. వాళ్ల శరీరం వెండి రంగులో ఉందని, తలలూ చాలా పెద్దగా ఉన్నాయని చెబుతున్నారు. .స్పైడర్ మ్యాన్‌లా ఉన్నారని, కళ్లు పసుపు రంగులో ఉన్నాయని అంటున్నారు. అవి ఏలియన్స్ అనే, తమపై దాడి చేశాయని ప్రచారం చేశారు.

ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే స్థానికంగా ఇది చాలా ఆందోళనకు గురి చేస్తోంది. మరోసారి గ్రహాంతర వాసుల అంశం చర్చకు వచ్చింది. అయితే అధికారులు మాత్రం గ్రామస్థులు చెబుతున్న విషయాల్ని కొట్టి పారేస్తున్నారు. Pelakara తెగకు చెందిన కొందరు ఇలా దాడులు చేస్తూ ముఖాలను తినేస్తుంటారని వెల్లడించారు. వాళ్లను Face Eatersగా పిలుస్తారు. అక్రమ బంగారు మైనింగ్ సిండికేట్స్‌లో పని చేసే వీళ్లు చాలా క్రూరంగా ఉంటారని, సెంట్రల్ సౌత్ అమెరికాలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వివరించారు అధికారులు. స్థానికులు చెబుతున్న విషయాలు మాత్రం వేరుగా ఉన్నాయి.

అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం... వాళ్లు అక్రమ మైనింగ్ మాఫియా సభ్యులు. జులై 29న 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు. గొంతు కోసి చంపారు. బాలిక శరీరంపై చాలా గాయాలు కనిపించాయి. ఇదే సమయంలో ఏలియన్స్ దాడి చేస్తున్నాయని గ్రామస్థులు చెప్పడంపై అధికారులు అక్రమ మైనింగ్ మాఫియాపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News