1600 లీటర్ల చనుబాలు దానం చేసిన దేవతకు గిన్నిస్ రికార్డ్

Update: 2023-07-15 13:51 GMT

గంగిగోవు పాలు గరిటడైనను చాలు అన్నట్టు.. ఎన్నో రకాల పోతపాలు, ఎన్నో రకాల బేబీ ఫుడ్స్ అందుబాటులో ఉన్నా తల్లిపాలకు సాటి వచ్చేవి ఈ లోకంలో ప్రస్తుతానికి ఏవీ లేవు. ప్రకృతి సిద్ధమైన చనుబాలతో బిడ్డలు ఆరోగ్యంగా పెరగడమే కాక, వ్యాధులను తట్టుకునే శక్తి కూడా పొందుతారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో చాలామంది పసిబిడ్డలు తల్లిపాలకు దూరం అవుతుంటారు. కొందరు తల్లులకు పాలు తక్కువ అయితే, కొందరు అందం చెడిపోతుందనే అపోహలతో పాలు సరిగ్గా ఇవ్వరు. ఇక తల్లికి దూరమైన అనాథ బిడ్డల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిపాల దానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో వేలమంది పిల్లలు బర్రెపాలు, ఆవుపాలతో సరిపెట్టుకుంటున్నారు.

ఈ పరిస్థితి గమనించిన ఓ మాతృమూర్తి ఏకంగా 1600 లీటర్ల చనుబాలను దానం చేసి గిన్నిస్ రికార్డుకెక్కింది. మొత్తంగా తొమ్మిదేళ్లలో పదివేల లీటర్లను విరాళం అందించింది. 2015-18 మధ్య అత్యధికంగా ఇవ్వడంతో గిన్నిస్ రికార్డు దక్కిది. వందలాది పిల్లలకు స్వచ్ఛమైన తల్లిపాలు అందించి ప్రశంసలు పొందుతోంది. అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రానికి చెందిన ఆమె పేరు ఎలిసబెత్‌ అండర్సన్‌ సియోర్రా. ముగ్గురు బిడ్డల తల్లి అయిన ఎలిసబెత్ 2015 - 2018 మధ్య 1,599.68 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ దానం విరాళంగా ఇచ్చింది. కొన్ని లీటర్లను తల్లిపాల బ్యాంకులకు మరికొన్ని లీటర్లను తనే నేరుగా పిల్లలకు అందించింది. వారిలో చాలామంది నెలల నిండని పిల్లలు కూడా ఉన్నారు. పాలను అధికంగా ఉత్పత్తి చస్తో హైపర్ లాక్టేషన్ లోపం వల్ల ఆమెకు పాలు విపరీతంగా ఉత్పత్తి కావడం దీనికి కారణం. ఎలిజబెత్ భర్త పుయెర్టోరికో దేశస్తుడు. ఓ సారి ఆదేశానికి వెళ్లిని ఎలిజబెత్.. పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న బిడ్డకు పాలు పట్టింది. అప్నట్నుంచి వందలాది పిల్లలకు చనుబాలు అందించింది. అంతమంది ఆకలి తీర్చినందుకు తనకు సంతోషంగా ఉందని, తల్లిపాలపై మరింత అవగాహన పెరిగితే బిడ్డలకు పోతపాత అవసరం కాస్త తప్పుతుందని ఎలిసెబత్ చెబుతోంది.



Tags:    

Similar News