విమానంలో బిగబట్టుకోలేక పోసేసిన మహిళ

Update: 2023-07-23 08:19 GMT

విమానాల్లో మలమూత్ర విసర్జనకు టాయిలెట్లు ఉంటాయి. అయినా కొందరు తింగరి మనుషులు తాము కూడా టాయిలెట్లలో పోస్తే వెరైటీ ఏముంటుందని సీట్ల దగ్గరే పని కానిస్తున్నారు. కొందరు మద్యం మత్తులో పక్కనున్న ప్రయాణికులను తడిపేస్తున్నారు. ఈ వ్యవహారాలు కేసులు, జరిమానాల దాకా వెళ్తున్నాయి. కొందరిది పైత్యమైతే కొందరిదేమో ఆపుకోలేని యమ అర్జెంట్. మూత్రాన్ని బిగబట్టుకోలేక ఓ మహిళ బాత్రూంలో కాకుండా బయటే పోసింది. అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానం దీనికి వేదికైంది. సిబ్బంది ఎంతకూ బాత్రూం తలుపు తీయకపోవడంతో బయటే పోయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.

‘‘రెండు గంటల నుంచి మొత్తుకుంటున్నాను. అయినా టాయిలెట్ తలుపు తెరవలేదు. అందుకే కానిచ్చేశా. ఏం చేసుకుంటారో చేసుకోండి. అరెస్ట్ చేస్తారో, జైల్లో వేస్తారో వేసుకోండి. తప్పు నాది కాదు, నాతో ఈ పన చేయించిన మీదే’’ అని ఆమె గరమైంది. ఆ సంఘటలను విమాన సిబ్బంది వీడియో తీశారు. ‘‘మీ మూత్రం దుర్వాసన వస్తోంది, ముందు మంచినీళ్లు తాగండి’’ అని సిబ్బందిలో ఒకరు చెబుతున్నట్లు వీడియోలో ఉంది. ఆమెను ఎందుకు రెస్ట్ రూంలోకి అనుమతించలేదో తెలియడం లేదు. ఆమె మూత్రం పోస్తుండగా వీడియో తీయడం సరికాదని సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి.

Tags:    

Similar News