‘ఏంటో.. నా పేరు లేకుండా ఏదీ చేయలేకపోతున్నారు..!’ : అనసూయ భరద్వాజ్

Update: 2023-07-15 03:47 GMT

అనసూయ భరద్వాజ్.. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి, తనకున్న యాక్టింగ్ స్కిల్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఎప్పుడూ వివాదాస్పద వార్తలతో చర్చల్లో ఉండే అనసూయ.. మళ్లీ కొత్త వివాదానికి తెరలేపినట్లు తెలుస్తోంది. తన మనసులో ఉన్నది ముక్కుసూటి చెప్పే అనసూయ.. మరో ట్వీట్ తో చర్చల్లో నిలిచింది. ఆ ట్వీట్ ఎవరి గురించి పెట్టిందో.. ఎందుకు పెట్టిందో అర్థం కాని ఫ్యాన్స్.. ‘మళ్లీ ఏమైంది మేడమ్.. మిమ్మల్ని ఎవరేమన్నారు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ అనసూయ ఏమని ట్వీట్ చేసిందంటే.. ‘వావ్.. నేను నిజంగా ఇంపార్టెంట్ వ్యక్తినే. నా ప్రమేయం ఉన్నా.. లేకున్నా నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్‌ కూడా జరగదు. అంటే నాపై వాళ్లు అంతగా డిపెండై ఉన్నారు. నా పేరు తీయకుండా ఏదీ చెప్పలేకపోతున్నార’ని చెప్పింది. ఇదివరకు కూడా అనసూయ ఇన్ డైరెక్ట్ గా పెట్టిన ట్వీట్లు చాలా సందర్భాల్లో దుమారం చేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరో కొత్త సినిమా రిలీజ్ కాగా.. ఆ సినిమా పోస్టర్ పై అభిప్రాయం వ్యక్తం చేసింది అనసూయ. దాంతో ఆ హీరో ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News