సముద్రంలో తప్పిపోయాడు. కుక్కతో కలిసి ఎలా ఒడ్డుకు చేరాడో తెలుసా? అచ్చం లైఫ్ ఆఫ్ పై సినిమాలో లాగే..
చాలా మంది సముద్రంలో రోజులు తరబడి ప్రయాణాలు చేస్తుంటారు. దీనికి సంబంధించి రికార్డులు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళంతా దీని కోసం ముందే ప్రిపేర్ అవుతారు. ఎన్నిరోజులు ప్రాణం చేయాలనుకుంటున్నారో....దానికి తగ్గట్టు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. అయినా కూడా సముద్రంలో ట్రావెల్ చేయడం సాహసమే. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాంటిది మహాసాగరంలో చిక్కుకుపోతే....దారి తప్పిపోతే...అమ్మో ఊహించడానికే భయం వేస్తోంది కదా. అలా తప్పిపోయిన ఓ నావికుడి గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము.
లైఫ్ ఆఫ్ పై సినిమా చూశారా...అందులో సముద్రంలో చిక్కుకున్న కుర్రాడు ఎలా సర్వైవ్ అయ్యాడో గుర్తుందా. ఎన్నిపాట్లు పడ్డాడో మనందరం చూసాము కదా. అచ్చం అలాగే అయింది ఓ నావికుడి పరిస్థితి. సిడ్నీకి చెందిన టిమ్ షాడో అనే సెయిలర్ ఇలాగే పసిఫిక్ మహా సముద్రంలో తప్పిపోయాడు. ఏప్రిల్ లో మెక్సికోలోని లా పాజ్ నుంచి పాలినేషియాకు చెందిన బోట్ లో బయలుదేరాడు. 60 వేల కి.మీ ప్రయాణించాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కానీ మధ్యలో పసిఫిక్ లోని తుఫాన్ అతణ్ణి నిలువునా ముంచేసింది. అతని దగ్గర ఉన్న వస్తువులు అన్నీ పాడయిపోయాయి. నావిగేషన్ చూపించేది కూడా. ఎవ్వరినీ కాంటాక్ట్ చేయడానికి వీలు లేకుండా అయిపోయింది.
తుఫాన్ తగ్గిన తర్వాత చూసుకుంటే టిమ్ షాడోక్, ఓడ, అతని పెంపుడు కుక్క ఇవే మిగిలాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. సముద్రంలో చేపలు పట్టుకుని తినేవారు. వర్షం పడినప్పుడు ఆ నీటిని పట్టుకుని తాగేవారు. రాత్రివేళ ఓడలోని టెంట్ లో పడుకునేవారు. ఇలా రెండునెలలపాటూ జీవించారు. చివరకు ఓ హెలికాప్టర్ వీరిని గుర్తించింది. దాంతో అతని కష్టాలకు తెరదించినట్టు అయింది. సముద్రంలోని అతని జీవితం అంతటితో ముగిసింది.
షాడోక్, అతని కుక్క అన్ని కష్టాలు పడ్డా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళిద్దరి ఆరోగ్యాలు నిలకడగానే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. సముద్రంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాని చెబుతున్నారు షాడో. చేపలు పట్టడం నేర్చుకున్నాను. చాలా రోజులు ఆహారం, నిద్ర లేక బాధలు పడ్డాను. ఇప్పుడు తనకు ఆ రెండే చెయ్యాలని ఉంది అంటున్నారు షాడోక్. కొన్ని రోజుల పాటూ కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర తనకు చాలా అవసరం అని చెబుతున్నారు.