Snake In Cauliflower: కాలీఫ్లవర్లో కట్లపాము.. మినీ హార్ట్ అటాక్ కన్ఫార్మ్

Update: 2023-08-18 17:17 GMT

మార్కెట్ లో పురుగులు పట్టాయా, పుచ్చి పోయాయా అని ఎన్ని సార్లు చూసుకుని కూరగాయలు కొంటారో.. ఇకనుంచి అంతే జాగ్రత్తగా ఇంటికి వచ్చాక కూడా వాటిని కోయాలి. ఎందుకంటే ఎంత చూసుకుని కొన్నా వాటిలోనుంచి పురుగులు వచ్చినట్లు.. ఇప్పుడు పాములు కూడా వస్తున్నాయి. అవును.. ఇది నిజమే. ఓ మహిళ మార్కెట్ కు వెళ్లి కాలీఫ్లవర్ తీసుకొచ్చింది. దాన్ని వండటానికి చాక్ తో కచ్ చేయగా ఒళ్లు వణికిపోయే సీన్ కళ్లముందు కనిపించింది.

కాలీఫ్లవర్ లో నుంచి కట్లపాము బయటికి వచ్చింది. దీంతో షాక్ కు గురైన ఆ మహిళ కిచెన్ నుంచి బయటికి పరిగెత్తింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఎవరు తీశారు? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనే క్లారిటీ మాత్రం రాలేదు. వీడియోను చూసిని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. వర్షాకాలం కాబట్టి.. బయట కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలని కామెంట్ చేస్తున్నారు.


Tags:    

Similar News