యూనివర్సిటీలో క్షుద్ర పూజలు.. పుర్రె, కోడిగుడ్లతో..

Update: 2023-06-28 14:01 GMT

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. విరూపాక్ష సినిమా తరహాలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు, బొగ్గు పొడి, ఉప్పు, కోడి గుడ్లు, కుంకుమ, పుర్రె, రక్తం ఉపయోగించి యూనివర్సిటీ లైబ్రరీ ప్రాంతంలో క్షుద్రపూజలు చేశారు. గత రెండు రోజుల క్రితం కూడా యూనివర్సిటీలో ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో వద్ద క్షుద్ర పూజలు జరిగాయి. గత కొన్ని రోజులుగా యూనివర్శిటీలో ఇదే పరిస్ధితి నెలకొనడంతో అధ్యాపకులు, విద్యార్ధులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే కాకుండా రాత్రి సమయాల్లో యూనివర్శిటీలోకి బయటి వ్యక్తులు ప్రవేశించి మద్యం సేవిస్తున్నారని, వ్యర్ధాలను చెల్లాచెదురుగా పడేస్తున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News