పేషెంట్ ఇచ్చిన రూ.500 నోటు చూసి అవాక్కైన డాక్టర్

Update: 2023-07-09 06:05 GMT

ఇంటర్నెట్ వాడుతున్న వారందరికీ 'థ్రెడ్స్' యాప్ గురించి తెలిసే ఉంటుంది. 'ట్విట్టర్' కు పోటీగా జుకర్ బర్గ్ ఇటీవలే 'మెటా థ్రెడ్స్' యాప్ తీసుకొచ్చారు. మిలియన్ల సంఖ్యలో యూజర్లు ఈ యాప్ ను కూడా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ విషయం పక్కనబెడితే చాలామంది తమ అనుభవాలను ఆ యాప్ లో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'థ్రెడ్స్' యాప్ లో ఓ డాక్టర్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డాక్టర్ మానవ్ అరోరా షేర్ చేసిన ఈ పోస్ట్‌లో.. అతను ఫీజు కింద తన పేషెంట్లలో ఒకరి నుండి వచ్చిన నకిలీ రూ.500 నోటును చూసి ఏ విధంగా షాక్ అయ్యాడే విసయాన్ని తెలిపాడు. “ఇటీవల, ఒక పేషెంట్ కన్సల్టేషన్ ఫీజు కింద ఈ నోట్‌ని(నకిలీ 500 నోటు) రిసెప్షనిస్ట్ కి ఇచ్చాడు. మా రిసెప్షనిస్ట్ ఆ నోటుని అటు ఇటు తిప్పి చూసి.. ఏంటన్నట్లుగా అతని వైపే చూస్తుండిపోయింది. అది నకిలీ నోటు అని అర్థమైంది కానీ.. డాక్టర్‌ దగ్గరికి కూడా నకిలీ నోటుతో వచ్చారంటే.. ప్రజలు ఇలా తయారయ్యారేంటని అనిపిస్తోంది. కచ్చితంగా డాక్టర్ ని కూడా బురిడీ కొట్టిద్దామనే ఈ నోటుతో వచ్చారు. నేను ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నా." అని అన్నారు.

ఆ నోటును డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా రూ.500 నోటును థ్రెడ్స్ లో పోస్ట్ చేస్తూ..' ఏది ఏమైనప్పటికీ, నేను బాగా నవ్వాను.ఈ సరదా జ్ఞాపకాన్ని ఎప్పటికీ మరవలేను' అంటూ చెప్పుకొచ్చాడు. ఓ డాక్టర్ ను ఇలా కూడా మోసం చేసేందుకు ప్రజలు ఏ మాత్రం వెనకాడరనే దానికి ఈ ఘటనే సాక్ష్యమని తెలిపాడు. అదేవిధంగా అతడికి అది నకిలీ నోటనే విషయం తెలియదు అనే చెబితే, అది తాను నమ్మేందుకు సిద్ధంగా లేనంటూ డాక్టర్ మానవ్ అరోరా పోస్ట్ లో చెప్పుకొచ్చాడు.

Full View


Tags:    

Similar News