కుక్క కరిచిందని ముఖానికి సర్జరీ.. చివరికి ఇలా అయిందేంటి..!

Update: 2023-07-13 12:54 GMT

పెరుగుతున్న టెక్నాలజీతో.. అసాధ్యమైన వాటిని చాలావరకు సాధించారు. ప్రస్తుతం వైద్య రంగంలో కూడా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. దాంతో తమ రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జీ బాట పడుతున్నారు. లక్షలు పెట్టి సర్జరీలు చేసుకుని కొంతమంది సమస్యల బారిన పడుతున్నారు. ఇటీవల ట్రినిటీ రౌల్స్ అనే యువతి తన తండ్రిని కలవడానికి వెళ్లింది. ఆ క్రమంలో ఓ కుక్క తనపై దాడి చేసింది. ఆ దాడిలో కళ్లు, చెవులతో పాటు ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు ముందు బాగం పూర్తిగా తెగిపోయింది. దాంతో వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. కానీ, స్కిన్ గ్రాఫ్ట్ ఆపరేషన్.. ఆమె ముఖంలో భారీ మార్పులకు దారి తీసింది.

ప్రస్తుతం ఆమె కోలుకుంటుండగా.. ఇప్పుడిప్పుడే సమస్యలు బయట పడుతున్నాయి. ఆపరేషన్ క్రమంలో డాక్టర్లు నుదురు నుంచి చర్మాన్ని తీసి ముక్కుపై అమర్చారు. దాంతో కొన్ని రోజులకు ఆమె ముఖంపై వెంట్రుకలు మొలవడం ప్రారంభమైంది. ఆ ఫొటోలను ట్రినిటీ సోషల్ మిడియాలో షేర్ చేయడంతో.. క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె వెంట్రుకలు తొలగింపుకు ట్రీట్మెంట్ తీసుకుంటోంది.

Tags:    

Similar News