వీధికుక్కలతో ఈ పనిచేయిస్తే..వీడియో వైరల్

Update: 2023-07-15 12:55 GMT

అందరు ఎక్కువగా ప్రేమించే పెంపుడు జంతువులలో కుక్కలు ముఖ్యమైనవి. విశ్వాసానికి ప్రతిరూపంగా కుక్కలుంటాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలుగుతాయి. మనం ఏడిస్తే ఏడుస్తాయి..సంతోషంగా ఉంటే ఎగిరిగెంతుతాయి. తనను ప్రేమగా చూసుకునే యజమాని కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనుకాడవు శునకాలు. సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని పెంపుడు కుక్కల వీడియో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

తనకు ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టే వారి పట్ల కుక్కుల ఎంత విధేయతతో ఉంటాయో ఈ దృశ్యాలు చెబుతున్నాయి. రోడ్డుపై ఓ చెత్త ఏరి మోసుకు వెళ్తున్న ఓ మహిళకు తన పెంపుడు కుక్క సాయమందిస్తోంది. స్క్రాప్‌తో నిండిన బ్యాగ్ మోస్తూ ఆ మహిళ వెళ్తుండగా..ఆమె వెనుక ఓ శునకం చెత్త బ్యాగ్‌ను లాకెళ్లడం కనిపిస్తుంది.

@TheFigen_ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా వైరల్ గా మారింది. కుక్క చేసిన పనికి నెటిజన్లు మురిసిపోతున్నారు. శునకాలు ఎప్పుడూ మనిషికి మంచి మిత్రులే అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా...‘డాగ్స్ పని చేయడానికి ఇష్టపడతాయి’ మరొకరు రాసుకొచ్చారు. వీధి కుక్కలలతో ఇలా పనులు చేయిస్తే బెటర్ అంటూ ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. అయితే జంతు ప్రేమికులు మాత్రం భిన్నంగా స్పందించారు. కుక్కలతో ఇలాంటి పనులు చేయించడం తప్పు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News