ఆ ప్రాంతంలో కాలు బయటపెట్టాలంటే జనం వణికిపోతున్నారు. ఎటునుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందోని భయంతో అల్లాడుతున్నారు. విషయం ఏంటో తెలీదు కానీ అక్కడ జంతువులు మనుషులను చూస్తే క్రూరంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు కుక్కలు విరుచుకుపడితే ఇప్పుడు గాడిద వంతు వచ్చింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని గాంధీనగర్‌లో స్థానికులను కష్టాలు వెంటాడుతున్నాయి. రోడ్డుపై జంతువులు దాడికి దిగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఒక గాడిద వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసిన వీడియో కలకలం రేపుతోంది. వృద్ధుడు రోడ్డుపై వెళ్తుండగా పక్కగా నిల్చొని ఉన్న గాడిద అతడి మీదకు దూసుకొని వచ్చింది. కింద పడవేసి తన కాళ్లతో తొక్కివేసి తలతో గుద్దుతూ దాడికి దిగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు గాడిదను వెళ్లగొట్టేందకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వృద్ధుడిపై దాడి చేస్తూనే ఉండడం వీడియోలో కనిపిస్తోంది. చివరికి ఓ వ్యక్తి కర్రతో కొట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. గాడిద దాడిలో స్వల్పంగా గాయపడిన వృద్ధుడు తరువాత కాస్త తేరుకుని నిలబడ్డాడు. ఈ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన 2023 జూలై 7,ఉదయం 11 గంటలకు జరిగింది.
దీనికిముందు ఇదే ప్రాంతంలో జరిగిన కుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడులపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడచిన మూడు రోజుల్లో స్థానిక జంతువుల కారణంగా జరిగిన రెండవ దాడి కావడం గమనార్హం.
महाराष्ट्र के #कोल्हापुर में एक गधे ने सड़क पर चल रहे बुजुर्ग पर किया जानलेवा हमला..पूरी घटना CCTV में कैद..घटना गांधीनगर इलाके में 7 जुलाई सुबह 11 बजे की है..पिछले 3 दिनों में गधे द्वारा लोगों पर हमले की यह दूसरी घटना@indiatvnews@KOLHAPUR_POLICE@Dev_Fadnavis pic.twitter.com/WoWt4vCjap
— Atul singh (@atuljmd123) July 8, 2023