ప్రస్తుత కాలంలో విద్యార్థుల మధ్య ఎంత పోటీ ఉందో తల్లిదండ్రుల మధ్య అంతే పోటీ ఉంది. తమ పిల్లలు చదువులో రాణించాలని, ఎక్కువ మార్కులు సాధించాలని పేరెంట్స్ పరితపిస్తున్నారు. దీంతో పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. స్కూల్లో టీచర్స్, ఇంట్లో పేరెంట్స్ పెట్టే ప్రెజర్ తట్టుకోలేక ఎంతో మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం చెప్పబోయే పేరెంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్. తమ కొడుకు పాసయ్యితే చాలనుకున్నారు. వాళ్లు అనుకున్నట్టు కుమారుడు పాసవ్వడం, అది కూడా అన్ని సబ్జెక్టుల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులు మాత్రమే రావడంతో ఆనందంలో మునిగిపోయారు. కొడుకుతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. థానేకు చెందిన విశాల్ అశోక్ కరాడే అనే విద్యార్థిఅన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులు మాత్రమే సాధించాడు. అయినా ఆ తల్లిదండ్రులు ఏమాత్రం బాధపడలేదు. పైగా తమ కొడుకును చూసి మురిసిపోయారు. కుమారుడితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. విశాల్ పేరెంట్స్ చేసిన పనికి ప్రశంసలు వస్తున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.