ప్రియురాలికి ఆస్తిలో వాటా..రూ.900కోట్లు రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని

Update: 2023-07-10 08:34 GMT

మీడియా టైకూన్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని ఈ మధ్యనే తన 86ఏళ్ల వయసులో మరణించారు. మూడు సార్లు ఇటలీకి ప్రధానిగా ఉన్న సిల్వియో వేల కోట్ల ఆస్తులకు అధిపతి ఉన్నారు. సిల్వియో మరణానంతరం ఇప్పుడు ఆయన వీలునామా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బిలియనీర్ వీలునామాలో తన గర్ల్ ఫ్రెండ్‎కు భారీ మోత్తంలో షేర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకంటే 53 ఏళ్లు చిన్నదైన తన ప్రియురాలు మార్టా ఫాసినాకు ఏకంగా 100 మిలియన్ల యూరోలను రాసిచ్చాడట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.900 కోట్లు. మాజీ ప్ర‌ధాని బెర్లుస్కోనీ మొత్తం 54వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.

సిల్వియో ఆస్తి పంపకాలకు సంబంధించిన వీలునామాను రీసెంట్‎గా మీడియా సమక్షంలో ఆయన వారసులకు చదివి వినిపించారు. ఈ వీలునామాలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సిల్వియో తన 33 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్‎కు తన ఆస్తిలో ఏకంగా రూ.900కోట్లను రాసిచ్చారని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. చట్టపరంగా సిల్వియోకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మరో ఇద్దరితో కొన్నాళ్లు డేటింగ్ చేశారు. సిల్వియోకు మొత్తం ఐదు మంది సంతానం. పెద్ద కూతురు, కొడుకు ఇప్పుడు ఈయన సామ్రాజ్యాన్ని చూసుకుంటున్నారు. ఆస్తిలో చాలా వరకు వాటాను తమ పిల్లల పేర్ల మీదే రాశారు సిల్వియో. తన సోదరుడికి 900 కోట్ల ఆస్తి ఇచ్చారు. ఇక త‌న పార్టీకి చెందిన మాజీ సేనేట‌ర్ మార్సిలో డెల్ఉట్రికి 30 యూరోలు వాటా ఇచ్చారు.

2020 మార్చిలో సిల్వియో , మార్టాల ప్రేమాయణం మొదలైంది. ఇద్దరికీ వయసులో 53 వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం ఫోర్జా ఇటాలియా పార్టీలో డిప్యూటీగా మార్టా కొన‌సాగుతున్నారు. నిజానికి ఆమెను సిల్వియో అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. ఆయన చనిపోయే స‌మ‌యంలో ఆమెను భార్యగా పేర్కొన్న‌ట్లు సమాచారం. అందుకే తన ప్రేమకు గుర్తుగా ఆమె పేరుతో భారీ ఆస్తులు రాసిచినట్లు వార్తలు వస్తున్నాయి.



Tags:    

Similar News