వీళ్లెందుకు క్యూ కట్టారో తెలిస్తే... వైరల్ వీడియో

Update: 2023-08-06 04:56 GMT

ధర పెరిగిందని కొన్నాళ్లు కొనడం మానేశారు. కొన్నాళ్లు పావు కిలో కొన్నారు. కానీ వంటలో అది పడకపోవడంతో టేస్ట్ మారిపోయింది. నాలుక రుచి కోరింది. ఎక్కడో అక్కడ ఖర్చు తగ్గించుకుని కొనక తప్పని పరిస్థితి. కేజీ రూ. 100 నుంచి రూ. 250, రూ. 300లకు పెరిగిన కనీసం పావు కిలో అయినా కొనాల్సిందే. చివరికి ఒక్క పండైనా తప్పదు. విషయం అర్థమైంది కదా. టమాటాల గురించే. కేవలం సామాన్యులే కాదు, ధనికులు కూడా దెబ్బకు దిగివస్తున్నారు. డిస్కౌంట్ ఎక్కడ దొరుకుతుందని మొబైల్ యాప్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. మరోపక్క.. టమాటల దెబ్బకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతు ప్రభుత్వం అరకొర సబ్సిడీలు ఇస్తున్నాయి. రైతు బజార్లలోనే కాదు, ఇళ్ల దగ్గరి కూడా సబ్సిడీ పళ్లు అమ్ముతున్నాయి. వాటి కోసం జనం కరువు బాధితుల్లా బారులు తీరుతున్నారు. అలాంటి వీడియో ఒక తెగ చక్కర్లు కొడుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. జనం నోట్లరద్దు సమయంలో ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద క్యూ కట్టినట్టు టమాటాల వ్యాన్ దగ్గర క్యూ కట్టారు. గాజియాబాద్‌లో కిలో పళ్లు రూ. 200 పలుకుతున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కేజీ రూ. 130 కే ఇవ్వడానికి ఓ వ్యాన్‌తో మహాగుణ్ పురం సొసైటీకి వచ్చారు. అపార్ట్‌మెంట్లలోని జనం సంచులు పట్టుకుని వ్యాన్ వద్ద బారులు తీరారు. తమ వంతు వచ్చేవరకు ఓపిగ్గా నిలబడి కేజీ కేజీ లెక్కన కొనుక్కుని రూ. 70 ఆదా చేసుకున్నామని తృప్తిగా వెళ్లిపోయారు. ఈ వీడియోపై జనం నానా కామెంట్లూ పెడుతున్నారు. భారం తగ్గించారని కొందరు అంటుంటే, అపార్ట్‌మెంట్ల దగ్గర కాదు, బస్తీల్లో, పల్లెల్లో అమ్మాలని కొందరు విరుచుకుపడుతున్నారు.



Tags:    

Similar News