Viral: గర్భం దాల్చిన 'రోజీ'... బొట్టు, పూలు, గాజులతో సీమంతం..!!

Update: 2023-10-02 06:55 GMT

గర్భిణీ స్త్రీలకు సీమంతం వేడుకలు నిర్వహిస్తారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే కాస్త డిఫ్రంట్‌గా కడుపుతో ఉన్న కుక్కకు 'బేబీ షవర్' వేడుకను నిర్వహించింది ఓ కుటుంబం. కుక్కకు బొట్టు, గాజులు, చీర ధరించి... దానిపై పూలు చల్లి, స్వీట్లు తినిపించారు. అలాగే దాని ముందు, ఐయామ్ రెడీ అనే బోర్డ్ కూడా పెట్టడం విశేషం. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

తాజాగా గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్కకు.. దాని యజమానులైన సిద్ధార్థ్ శివమ్ కుటుంబం.. సీమంతం వేడుక చేశారు. తమ పెంపుడు కుక్క 'రోజీ'... గర్భం దాల్చడంతో దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. డెలివరీ సమయం దగ్గరపడడంతో.. అన్ని ముచ్చట్లు జరపాలనుకున్నారు. అందులో భాగంగానే సీమంతం చేశారు. కుక్కకు బొట్టు పెట్టి, గాజులు తొడిగారు. పూలు చల్లి, స్వీట్లు తినిపించారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది. ఈ వీడియోకి మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. అదేవిధంగా 1.7లక్షల లైకులు వచ్చాయి. ఇక, నెటిజన్లు యజమానులు చేసిన పనికి ఫిదా అయిపోతున్నారు. కుక్క సీమంతం చేయడం చాలా గొప్ప నిర్ణయం అని కొందరు కామెంట్స్ చేశారు. సో క్యూట్ అని కొందరు, కొందరు ఆ కుక్కకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News