వేసవి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్స్‌లో ఐస్ క్రీం ఒకటని నిస్సందేహంగా చెప్పవచ్చు. మనం ఏ రుచిని ఆస్వాదించినా చివరగా ఐస్ క్రీములు రిఫ్రెష్ ట్రీట్ ఆనందించే డెజర్ట్‌గా ఉంటుంది. అందుకే ఐస్ క్రీం లవర్స్ కోసం ప్రస్తుతం అనేక రెస్టారెంట్లు విభిన్నమైన వినూత్నమైన టేస్టుల్లో హిమక్రీములు అందిస్తున్నాయి. కస్టమర్ టేస్టును బట్టి ఐస్ క్రీం ను సర్వ్ చేస్తున్నారు. స్ట్రాబెర్రీ చీజ్‌కేక్ నుండి బెల్జియన్ చాక్లెట్ వరకు ఇలా ఎన్నో రకాల రుచులు ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ఐస్ క్రీములంటే సాధారణంగా స్వీట్‌గా ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఐస్‌క్రీం స్కూప్‌లో స్పైసీ ఎడ్జ్‌ను ఊహించారా? పచ్చిమిర్చితో కలిపి హిమక్రీములను లాగించారా లేదా అయితే ఇండోర్‌లోని ఒక స్ట్రీట్ ఫుడ్ విక్రేత పూర్తిగా పచ్చి మిరపతో చేసిన గ్రీన్ చిల్లీ ఐస్‌క్రీమ్‌ను రూపొందించాడు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ప్రముఖ ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రీన్ చిల్లీ ఐస్‌క్రీమ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోకాస్త కొద్ది క్షణాల్లోనే నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.దేశంలోనే అత్యంత ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ హబ్‌లలో ఒకటైన ఇండోర్‌లోని సరాఫా బజార్‌లోని స్ట్రీట్ ఫుడ్ విక్రేత ఈ ప్రత్యేకమైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేశాడు. చాక్లెట్ సాస్ , చెక్కర పాకంతో పాటు ఐస్ క్రీమ్ కౌంటర్‌లో మొత్తం పచ్చిమిర్చి జోడించి ఐస్ క్రీమ్‌ను ఎలా చేశాడో ఈ మేకింగ్ వీడియోలో చూడవచ్చు. ఈ ఐస్ క్రీమ్‌ను క్యాండీడ్ ఫ్రూట్స్, కారామెల్ సిరప్ , కొబ్బరి తురుముతో అందంగా అలంకరించి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నాడు.
ఈ మేకింగ్ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ కావడంతో ఈ స్ట్రీట్ ఫుడ్ విక్రేత వింత సృష్టిపై ఇంటర్నెట్లో చర్చ నడుస్తోంది. కొంత మంది నెటిజన్లు ఈ స్పైసీ విచిత్రమైన ఐస్ క్రీంను తినాలని కోరుకుంటున్నారు. మరికొందరు ఇదేం తిండిరా బాబు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.