నువ్వు గాయపడ్డ పాటవి...కానీ ప్రజల గాయాలకు పట్టుబడ్డ పాటవి అంటున్న జనసేనాని

Update: 2023-08-08 06:44 GMT

ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి రెండు తెలుగు రాష్ట్రాలకూ తీరని లోటు. ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉన్నవారికి మరీను. గద్దర్ మరణం పవన్ కల్యాణ్ ను కృంగదీసింది. పవన్ కూ, గద్దర్ కూ మంచి అవినాభావ సంబంధం ఉంది. నిన్న ఆయనకు నివాళులర్పించడానికి వెళ్ళినప్పుడు కూడా జనసేనాని కన్నీటి పర్యమంతయ్యారు. ఇప్పుడు గద్దర్ అంటే తనకు ఎంత ఇష్టమో కవిత రూపంలో చూపిస్తున్నారు.

అన్యాయంపై తిరగబడ్డ పాటవి...ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి...ఇప్పుడు లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి అంటూ గద్దర్ మీద తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ కల్యాణ్. బీటలు వారే ఎండలో...సమ్మెట కొట్టే కూలి గొడుగు గద్దర్. తాండాలా బండలో చలిపులిని బెదిరించే నెగడు గద్దర్. పీడిత జనుల పాట గద్దర్...అణగారిన ఆశల ఆర్తి గద్దర్. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్...కోయిల పాడిన కావ్యం గద్దర్. గుండెకు గొంతువస్తే...బాధకు భాష వస్తే అది గద్దర్. అన్నింటికీ మించి నా అన్న గద్దర్ అంటూ ఎమోషనల్ అయ్యారు. తీరం చేరిన ప్రజా యుద్ధనౌకకి జోహార్...జోహార్...జోహార్ అంటూ నినదించారు.

పవన్ ఈ కవితను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో తానే స్వయంగా చెబుతున్న వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

Tags:    

Similar News