దాడి చేసిన పులిని బైక్‌కు కట్టుకొచ్చిన యువకుడు.. వీడియో
మనిషికి ఒక గుండె మాత్రమే ఉంటుంది. మామూలు ధైర్యసాహసాలు ప్రదర్శించడానికి అది సరిపోతుంది. అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించాలంటే రెండు గుండెలు కావాల్సిందే. ‘‘ఎన్ని గుండెలురా నీకు?’’ అని అందుకే ఆశ్చర్యపోతుంటాం. కర్నాటకకు చెందిన వేణుగోపాల్ అనే యువకుడి సహసాన్ని చూసి జనం అదే మాట అంటున్నారు. అతడు తనపై దాడి చేసిన చిరుతపులితో దీటుగా తలపడడమే కాకుండా, దాన్ని బంధించి తన బైకుకు మేకపిల్ల మాదిరి కట్టుకుని ఊళ్లోకి రావడమే దీనికి కారణం.
హసన్ జిల్లా బాగివలు గ్రామ శివారులో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వేణుగోపాల్ అనే యువరైతు ఎప్పట్లాగే పొద్దున తన పొలానికి బైక్‌పై వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. వేణుగోపాల్ పారిపోయే ప్రయత్నం చేయగా పులి వెంటాడి మరీ దాడి చేసింది. దీంతో అమీతుమీ తేల్చుకోవాలని దానితో తలపడి దగ్గరున్న తాడుతో బంధించాడు. తర్వాత కర్రకు వేలాడగట్టి బండికి కట్టుకుని తీసుకొచ్చాడు. నెత్తురోడుతున్న వేణుగోపాల్‌కు గ్రామస్తులు చికిత్స చేశారు. తర్వాత వేణుగోపాల్ పులిని అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. పులిని హింసించడం తప్పే అయినా ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేయడం తప్పుకాదని అధికారులు అతణ్ని వదిలేశారు. పులి వయసు ఏడాది ఉండొచ్చని, అందుకే అది సులభంగా దొరికిందని చెప్పారు.
Hassan: A young man Himself catched a leopard and handed it over to the forest department.
— Abid Momin عابد مومن (@AbidMomin313) July 15, 2023
#Karnataka #forest pic.twitter.com/UvPyLlCu56