కార్పెట్‌పై కొత్త రోడ్డు..నాలుగు రోజులకే అట్టముక్కలా పైకి...వీడియో వైరల్

Update: 2023-06-01 13:30 GMT

రహదారులు ప్రగతికి చిహ్నాలు. అలాంటి రోడ్లు కోసం కోట్లు రూపాయలను ప్రభుత్వాలు కేటాయిస్తాయి. కానీ కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల అవినీతితో కొత్త రోడ్లు వేసిన కొద్ది రోజులకే పాడైపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ వింత రోడ్డు దర్శనమిచ్చింది. రోడ్డు వేసిన నాలుగు రోజులకే పలువురు వ్యక్తులు రోడ్డును పైకి లేపేశారు. అట్టముక్కలా చేతితో రోడ్డును ఎత్తి కాంట్రాక్టర్, అధికారులపై మండిపడ్డారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన‎లో భాగంగా జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో కొత్త రహదారిని నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలను పక్కనపెట్టి.. రోడ్డు మీద కార్పెట్‌ను బేస్‌లాగా పరిచి దానిపై తారు రోడ్డును కాంట్రాక్టర్ నిర్మించారు. దీంతో రోడ్డు వేసిన నాలుగు రోజులకే అట్టముక్కలా పైకి వచ్చేయడంతో స్థానికులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్‌ మాత్రం జర్మన్ టెక్నాలజీని ఆధారంగా రోడ్డుపై కార్పెట్ వేసి.. దానిపై తారు రోడ్డు నిర్మాణం చేసినట్లు చెప్పడం విశేషం.



Tags:    

Similar News