పునర్జన్మ.. దీనిపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. కొందరు పునర్జన్మ ఉందని నమ్మితే.. మరికొందరు అదంతా పెద్ద డ్రామా అంటూ కొట్టిపారేస్తుంటారు. అలాంటి ఓ ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లోని మైన్ పూర్ జిల్లాలో జరిగింది. ఎనిమిదేళ్ల ఆర్యన్ పునర్జన్మించానంటూ చెప్తుంటే.. ఆ ఊరివాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. మంగల్ పూర్ గ్రామానికి చెందిన ఆర్యన్.. తన తల్లిదండ్రులతో కలిసి రతన్ పూర్ లోని అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లాడు. వాళ్లకు ఎదురెళ్లి పలకరిచిన తన అమ్మమ్మను పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు ఆర్యన్ తల్లి మందలించగా.. ‘ఆమె నా భార్య. నేను అలానే పిలుచుకుంటా’ అని బదులిచ్చాడు. తర్వాత తన మామలను కూడా అలానే పలకరించాడు. వాళ్ల తన కొడుకులంటూ చెప్పుకొచ్చాడు.
మొదట అవేవీ పట్టించుకోని వాళ్లు.. రాను రానూ ఆర్యన్ మాటలను నమ్మడం మొదలుపెట్టారు. తన పేరు నీరజ్ మిశ్రా అని చెప్తూ.. పొలం పనులు చేస్తుండగా పాము కాటు వల్ల తను ఎలా చనిపోయాడని క్లీయర్ గా వివరించాడు. ఆ టైంలో ఆర్యన్ వాళ్ల అమ్మ రంజన్ గర్భవతి. నీరజ్ అంత్య క్రియలు పూర్తైన మరుసటి రోజు.. ఆర్యన్ కు జన్మనిచ్చింది. అయితే, ఆర్యన్ నాలుగేండ్ల నుంచే పునర్జన్మ గురించి మాట్లాడే వాడట. ఇప్పడు తన జన్మలో జరిగిన ప్రతి విషయాన్ని ఆర్యన్ చెప్తున్నాడు. దాంతో నీరజ్.. ఆర్యన్ రూపంలో మళ్లీ పుట్టాడని నమ్ముతున్నారు.