ఇదేందయ్యో ఇది.. పొట్ట మీద 31 నరుక్కున్నాడు.. వీడియో

Update: 2023-11-07 14:51 GMT

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. పొట్ట నింపుకోవడానికి ఏం చేసినా తప్పులేదు! ఆ జానెడు పొట్టతోనే ఓ పెద్దమనిషి వైరల్ అయ్యాడు. పొట్టమీద ఒక నిమిషంలో ఏకంగా 31 పుచ్చకాయలను తనే నరుక్కుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. పొట్టపై కవచం, చెక్కలాంటి ఏ కవరింగూ లేకుండా కేవలం టీషర్టు వేసుకుని సఫా సఫా నరికేసుకున్నాడు. అవి కూడా పెద్దపెద్ద పుచ్చకాయలు కావడం గమనార్హం.

అమెరికాకు చెందిన ఆష్రిటా ఫర్మన్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఓ వ్యక్తి అతని పొట్టపై పుచ్చకాలు పెడుతుంటే గురితప్పకుండా అడ్డంగా నరుక్కున్నాడు. ఇది 2018 నాటిని రికార్డే అయినా గిన్నిస్ బుక్ తాజాగా వీడియోను వదడంతో వైరల్ అయ్యింది. అలా నరుక్కువాలంటే ప్రాణాలకు తెగించి ఉంటాడని కొందరు అంటున్నారు. అభ్యాసం కూసు విద్య కనుక ప్రాక్టీస్ చేస్తే పొట్టమీదేం ఖర్మ ఎదపైనా, ముఖంపైనా పెట్టుకుని ఖండించుకోవచ్చని కొందరు జోకుతున్నారు. ఇందులో కొసమెరుపేమంటే.. ఫర్మన్ రికార్డును మన భారతీయిద్దరు ఇప్పటికే అడ్డంగా నరికేశారు. పి. ప్రభాకర్ రెడ్డి, పి. సురేశ్ అనే ఇద్దరు తెలుగు వ్యక్తులు ఒక నిమిషంలో ఏకంగా 64 పుచ్చకాయలపై పొట్టపై పెట్టుకుని నరుక్కున్నారు.

https://www.instagram.com/reel/CzPB0ZMtPuK/?utm_source=ig_web_copy_link


Tags:    

Similar News