ఇదేందయ్యా ఇది.. ఇటువంటి పాంప్లెట్ మేం ఏడ చూడ్లే...

Update: 2023-06-01 16:05 GMT

పెళ్లి సంబంధం.. మామూలుగా ఇంట్లోవాళ్లు లేదా తెలిసిన వాళ్లు చూస్తారు. లేకపోతే మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా వెతుకుతారు. ఇంకొంత మంది ప్రేమపెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ కొంతమందికి పెళ్ళి కూతురు దొరక్కా నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారు కొన్ని సార్లు చేసే పనులు వైరల్గా మారుతాయి. తాజాగా ఓ యువకుడు తనను పెళ్లి చేసుకునే అమ్మాయి కోసం తయారుచేసిన పాంప్లెట్ వైరల్గా మారింది.. దీనిని చూసిన వారంతా ఓరి నీ యేషాలో అని అవాక్కవుతున్నారు.

‘‘నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు ఎవ్వరైనా ఎటువంటి ఫోన్లు, ఎస్ఎంఎస్లు చెయ్యాల్సిన అవసరం లేదు. నేరుగా రామన్నపేటలోని మా ఇంటికి వచ్చి ధైర్యంగా నన్ను కలవగలరు. మా ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఎవ్వరితో మాట్లాడకుండా నేరుగా నాతో మాట్లాడండి.


కండీషన్స్ అప్లై..

‘నేను తెలిపిన అడ్రస్కు ఫొటోలు తీసుకుని మీకు వీలు ఉన్నప్పుడు రాగలరు. ఒకవేళ మీరు వచ్చిన సమయానికి నేను ఇంటి వద్ద లేనట్లైతే బాధపడకుండా మళ్లీ ఎప్పుడైనా వచ్చి నన్ను కలవగలరు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6గంటల లోపు నన్ను తప్పకుండా కలవగలరు అని ఆ పాంప్లెట్లో రాసుకొచ్చాడు.

ఈ మ్యాటర్కు ‘‘నిలకడలేని మనస్సును కలిగిన మనుషులు తమ గమ్యాన్ని చేరుకోలేరు’’, ‘‘ఆశపడండి.. దురాశపడొద్దు..’’ అనే లైన్స్ను యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్గా మారింది. దీనని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News