ఓ ఉద్యోగి ఆఫీస్‌కు వెళ్లి ఆరు గంటలు బాత్రూంలోనే ఉండడంతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. కంపెనీ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో అతడిని విధుల నుంచి యాజమాన్యం తొలగించింది. అయితే కంపెనీపై నిర్ణయంపై ఆ ఉద్యోగి న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు ఏం చెప్పింది..అసలు అతడు ఎందుకు అన్ని గంటలు బాత్రూంలో ఉంటున్నాడు? అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం.
చైనాలో వాంగ్ అనే వ్యక్తిని 2015లో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. రోజు ఆఫీస్‌కు వెళ్లి ఆరు గంటలు బాత్రూంలోనే గడపడంతో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. రోజులో రెండు సార్లు బాత్రూంకి వెళ్తున్న అతడు 47 నిమిషాల నుంచి గరిష్ఠంగా మూడు గంటల వరకు లోపలే ఉంటున్నాడని కంపెనీ గుర్తించి చర్యలు తీసుకుంది. దీనిపై ఉద్యోగి న్యాయ పోరాటానికి దిగాడు. తన ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించాడు.
తనకు మలద్వార సమస్య ఉందని. ఆ కారణంగానే టాయిలెట్లో ఎక్కువ సమయం గడపాల్సి వస్తోందని కోర్టుకు విన్నవించుకున్నాడు. తన ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సదరు కంపెనీ కూడా న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. అనధికార గైర్హాజరు, విధుల్లో జాప్యం వంటి కారణాలతో తొలగించినట్లు తెలిపింది. అతడు 6 గంటలకు బాత్రూంలో గడుపుతున్నట్లు ఆధారాలను కోర్టుకు సమర్పించింది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తన తీర్పును వెల్లడించింది. ఈ విషయంలో కంపెనీ చర్యను న్యాయస్థానం సమర్థించింది తీర్పునిచ్చింది.