ప్రపంచవ్యాప్తంగా దేశాలను బట్టి ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. అక్కడి ప్రజలు వాటిని పాటిస్తుంటారు. కొన్ని ఆచారాలు మాత్రం చూడడానికి, వినడానికి కొంచెం వింతగా అనిపిస్తాయి. తాజాగా దక్షిణ మెక్సికో లోని శాన్ పెడ్రో హువామెలులా అనే పట్టణంలోని ప్రజల సాంప్రదాయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ప్రాంత మేయర్‌కు ఓ ఆడ మొసలిలో వివాహం జరిపించారు. దీనికి గల కారణమెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
230 ఏళ్లుగా పూర్వికుల నుంచి వచ్చిన ఆచారాం ప్రకారం చొంటల్, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో మేయర్ విక్టర్ హ్యూగో సోసా మెసలిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహంతో తమ ప్రాంత ప్రజలకు అదృష్టం కలిసివస్తోందని వారి నమ్మకం. ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. వరుడు వధువు(మొసలి)ను ఎత్తుకుని నృత్యం చేసి దాని నుదుటిపై ముద్దు పెట్టడంతో వేడుక ముగుస్తుంది. ప్రజలు పెళ్లికుమారుడిని చొంటల్ రాజుగా.. మొసలిని రాణిగా భావిస్తారు. ఈ సమయంలో మొసలి నుంచి ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు దానికి ముక్కుకు దారం కట్టారు. ప్రస్తుతం మేయర్-మొసలి వివాహం వైరల్‌గా మారింది.