స్వార్థం లేని తల్లి ప్రేమ.. చివరికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా..

Update: 2023-07-18 13:09 GMT

ఈ లోకంలో స్వార్థంలేని వాళ్లెవరైనా ఉన్నారంటే.. అది అమ్మే. తల్లిదండ్రులు, భర్త, పిల్లు.. కుటుంబ బాధ్యతల కోసం తన కోరికలను పక్కన పెడుతుంది. తనను తాను మర్చిపోయి.. సర్వస్వం పిల్లలకు అంకితం ఇస్తుంది. నిరంతరం వాళ్ల కోసమే శ్రమిస్తుంది. తాజాగా ఓ తల్లి తన కొడుకు చదువు కోసం ప్రాణ త్యాగం చేసింది. పరిహారం కోసం ప్రాణాలను వదులుకుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాను విషాదంలోకి నెట్టేసింది.

సేలం కలెక్టర్ ఆఫీస్ లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పాపాతి (45).. 15 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఒంటరిగానే పిల్లల బాగోగులు చూసుకుంటోంది. తన కొడుకును ఎలాగైనా చదివించి ప్రయోజకుడిని చేయాలని భావించింది. కానీ, దానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుపడ్డాయి. కొడుకు కాలేజీ ఫీజు భారమయింది. ఈ క్రమంలో తను చనిపోతే నష్ట పరిహారం వస్తుందని ఎవరో చెప్పగా.. ఆ మాటలను నమ్మిన పాపాతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుతో వచ్చే డబ్బుతో కొడుకు ప్రయోజకుడు అవుతాడని నమ్మి.. ఓ బస్సు కింద పడి సూసైడ్ చేసుకుంది. ఇదంతా పక్కనే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యేసరికి.. వీడియో చూసిన వాళ్లంతా కంట తడి పెట్టుకుంటున్నారు.


Tags:    

Similar News