లగ్జరీ ఇంటిని అమ్మేసిన అంబానీ.. ఎంత పలికిందటే..

Update: 2023-08-11 11:54 GMT

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని కుబేరులు తలచుకుంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లోనూ ఆకాశహర్మాలు కట్టుకుంటారు. దుబాయ్, న్యూయార్క్, పారిస్, లండన్, టోక్యో, షాంఘై, ముంబై వంటి మరెన్నో నగరాల్లో ఒక ఇల్లు ఉండడం వారికి ప్రిస్టేజీ. మన దేశ అపరకుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి కూడా చాలా దేశాల్లో భవనాలు ఉన్నాయి. వాటిని కొనడం, మంచి ధర వస్తే అమ్ముకోవడం ఆయనకు మామూలే. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఖరీదైన ఇంటిని అంబానీ విక్రయించాడు. మాన్‌హట్టన్‌లోని ఆయన అపార్ట్‌మెంట్‌ను రూ.74.53 కోట్లకు(90 లక్షల డాలర్లు) అమ్ముడుబోయింది. హడ్సన్ నది పక్కనే 400 డబ్ల్యూ 12వ వీధిలో అందమైన వ్యూతో ఉన్న ఈ విలాస భవనం ప్రైమ్ లొకాలిటీ ఉండడంతో భారీ ధర పలికింది. సుపీరియర్ ఇంక్ అనే బిల్డింగ్‌లో నాలుగో అంతస్తులో ఈ అపార్ట్‌మెంట్ ఉంది. దీని విస్తీర్ణం 2,406 చదరపు అడుగులు కాగా రెండు పెద్ద పడగ్గదులు, అన్ని ఆధునిక సదుపాయాలూ ఉన్నాయి.

న్యూయార్‌లోని 248 గదులున్న లగ్జరీ హోటల్ ‘మాండరిన్ ఓరియంటల్’ కూడా అంబానీదే. హోటల్లో సింహభాగం వాటాను ఆయన రూ. 2వేల కోట్లు వెచ్చించి కొన్నారు. అదే బిల్డింగ్‌లో మార్క్ జాకబ్స్, హిల్లరీ స్వాంక్ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. అంబానీ కుటుంబమంతా ముంబైలోని 27 అంతస్తుల ‘యాంటిలియా’ భవనంలో నివసిస్తుంటుంది. అంబానీకి దుబాయ్, లండన్, పారిస్ తదతర నగరాల్లోనూ ఇళ్లు ఉన్నాయి. లండన్ స్టోక్ పార్కులోని ఇంటిని ఏకంగా రూ. 600 కోట్లకు కొన్నాడు. దుబాయ్‌లోని ఇంటి విలువ రూ. 639 కోట్లు.


Tags:    

Similar News