మగాళ్లు ముద్దు పెట్టుకున్నారని.. మ్యూజిక్ ఫెస్టివల్ క్యాన్సిల్
కొన్ని దేశాల్లో ఒక్కో రూల్ ఉంటుంది. అక్కడికి వెళ్లినప్పుడు వాటిని పాటించడం మంచిది. లేదంటే.. పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. తాజాగా ఇలాంటి ఘటనే మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగింది. అక్కడి చట్టలను అతిక్రమించిన ఓ పాప్ బ్యాండ్ ను దేశం నుంచి వెళ్లగొట్టింది. అంతేకాదు వాళ్లు నిర్వహించే మ్యూజిక్ ఫెస్టివల్ ను కూడా రద్దు చేసింది. ఇంతకీ వాళ్లేం చేశారంటే..
ప్రముఖ పాప్ బ్యాండ్.. ‘ది 1975’ మలేషియాలోని కౌలాలంపూర్ లో నిర్వహించిన మ్యూజిక్ ఫెస్టివల్ పాల్గొనేందుకు వచ్చింది. ఆ పాప్ బ్యాండ్ లోని హీలీ (34).. తన సహచర సింగర్ ను వేదికపై ముద్దు పెట్టుకున్నాడు. అయితే, మలేషియాలో స్వలింగ సంపర్కం నేరం. వారికి వ్యతిరేక చట్టాలున్నాయి. దాంతో ఒకే లింగానికి చెందిర ఇద్దరు వ్యక్తులు స్టేజీపై ముద్దు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించింది అక్కడి ప్రభుత్వం. అంతేకాకుండా అక్కడ నిర్వహిస్తున్న వీకెండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ను రద్ద చేసింది. బ్రిటిష్ పాప్ బ్యాండ్ చేసింది.. మలేషియా LGBTQ చట్టాలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ ఈవెంట్ మొత్తాన్ని అధికారులు రద్దు చేశారు.
music festival is canceled because the men kissed
Kuala Lumpur, Malaysia, viral news, music festival, LGBTQ rules, latest news, telugu news, the 1975, british pop band