ఈ పువ్వు అలాంటి ఇలాంటి పువ్వు కాదు. అంతరిక్ష తోటలో విరబూసిన మొట్టమొదటి పువ్వు. ఈ అద్భుతాన్ని సృష్టించింది నాసా సైంటిస్ట్ లు. కొన్నేళ్లనుంచి మనిషి అంతరిక్షంలో బతికేందుకు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్ట్ లు. అలా చేసిన పరిశోధనల్లో ఇప్పటి వరకు కూరగాయలు పండించడం, మొక్కలు పెంచడం లాంటి పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలు సక్సెస్ అయి.. తాజాగా టమాటోలను పండించారు.
ప్రస్తుతం అంతరిక్ష కక్షలో పెరిగిన జిన్నియా అనే పువ్వనును సోషల్ మీడియాలో షేర్ చేసింది నాసా. 1970 నుంచి సైంటిస్ట్ లు అంతరిక్షంలో మొక్కలు పెంచడం అధ్యయనం చేస్తున్నారు. మొదటిసారి 2015లో కెజెల్ లిండ్ గ్రెన్ అనే సైంటిస్ట్.. ప్రయోగాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు టమాటో, పాలకూర, చిలీ పెప్పర్ లాంటి ఆకుకూరలు, కూరగాయలు పండిచగా.. మొదటిసారి ఒక పూల మొక్కను నాటి సక్సెస్ అయ్యారు. ఈ పువ్వు రేకుల్ని ఒక రకమైన సాస్ తయారీలో వాడతారు.
First ever flower grown in space makes its debut! #SpaceFlower #zinnia #YearInSpace pic.twitter.com/2uGYvwtLKr
— Scott Kelly (@StationCDRKelly) January 16, 2016