టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య-నటాషా దంపతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్య ప్రస్తుతం తన భార్య,పిల్లలతో కలసి థాయ్‌లాండ్ ట్రిప్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలను ప్రస్తుతం హార్దిక్ పాండ్య భార్య నటాషా సోషల్‌మీడియాలో షేర్ చేస్తోంది. ఈ పిక్స్‌లో ఇద్దరు బాగా సన్నిహితంగా కనిపించారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. పబ్లిక్‌గా అవసరమా ఇలాంటివి అని అంటున్నారు.
'ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?' అంటూ నటాషా డ్రెస్సింగ్ తీరును తప్పుపడుతున్నారు. అయితే హార్దిక్ పాండ్య అభిమానులు మాత్రం.. 'వాళ్లు భార్యాభర్తలు. ఎలా ఉంటే మీకేంటి?', 'నటాషా డ్రెస్సింగ్ స్టైల్‌పై మీకు అభ్యంతరాలేమిటి?', 'మీ పని చూసుకోండి' అంటూ ట్రోల్ చేసే వారికి తిరిగి కౌంటర్లు ఇస్తున్నారు. కాగా, జులై 12 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్ టూర్‌తో హార్దిక్ పాండ్య మళ్లీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ కానున్నాడు.