దూసుకెళ్తున్న ట్రైన్ కింద పడుకుని... వీడియో వైరల్

Update: 2023-07-03 17:25 GMT

సోషల్ మీడియాలో వైరల్ కావడం కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని విచిత్ర పనులు చేస్తూ తిట్లు తింటారు. మరికొందరు పాపులారిటీ కోసం అడ్వెంచరెస్ పనులు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రైల్వే ట్రాక్ క్రింద ఓ యువకుడు పడుకుని ఉండగా.. ట్రాక్‌పై నుంచి రైలు వేగంగా వెళ్లడం ఆ వీడియోలో ఉంది.

అభిషేక్ నరేడా అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ట్రాక్ కింద ఓ యువకుడు పడుకున్నట్లు వీడియోలో ఉంది. రైలు వేగంగా వెళ్తున్నా ఆ యువకుడు అలానే పడకున్నాడు. ఈ వీడియోను అతని ఫ్రెండ్స్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు సదురు యువకుడిపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఈ వీడియోకు ఇప్పటికే 6లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇటువంటివి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News