దారుణం.. ఐఫోన్ కోసం 8 నెలల కొడుకును అమ్మేశారు

Update: 2023-07-27 14:20 GMT

సోషల్ మీడియా పిచ్చి జనాలను ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. ఆ మోజులో పడి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని పక్కన బెట్టినవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా ఓ కసాయి తల్లిదండ్రులు రీల్స్ పిచ్చిలో పడి తమ పిల్లల్ని అమ్మెందుకు నిర్ణయించుకున్నారు. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగాల్ లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాలో జరిగింది. రీల్స్ మోజులో పడిన జయదేవ్, సాథి జంట.. ఐఫోన్ కొనేందుకు ప్రయత్నం చేసింది. దాని ధర ఎక్కువ ఉండటంతో.. 8 నెలల పసికందును అమ్మేసింది. అలా వచ్చిన డబ్బుతో ఐఫోన్ కొని సోకులు మొదలుపెట్టారు.

ఉదయం నుంచి పిల్లోడు కనిపించకపోవడంతో.. కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను మందలించారు. దాని గురించి ఇద్దరు నోరు విప్పకపోగా.. చేతిలో ఖరీదైన ఐఫోన్ తో కనిపించే సరికి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దాంతో గట్టిగా అడిగేసరికి పిల్లాడిని అమ్మినట్లు ఒప్పుకున్నారు. అదే రోజు రాత్రి డబ్బుకోసం జయదేవ్ తన ఏడేళ్ల కూతురును కూడా అమ్మెందుకు నిర్ణయించుకున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. కుటుంబ సభ్యులు అందించిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు గాలిపు చేపట్టారు. ఖార్ దాహ్ ప్రాంతంలో నివసించే ప్రియాంకకు అమ్మినట్లు తెలుసుకున్న పోలీసులు.. ఆమెను పట్టుకుని ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జయదేవ్ పరారిలో ఉన్నాడు.


Tags:    

Similar News