ఫొటోలు దిగడంలో ఉన్న శ్రద్ధ.. పనితనంలో లేదే’.. పోలీసులపై నెటిజన్స్ ఫైర్
ట్రాఫిక్ పోలీసులకు దొరికినా, చలాన్లు కడున్నా ఆ భయం వేరేలా ఉంటుంది. అయితే, బెంగళూరులోని ఓ వ్యక్తి మాత్రం ఏం భయపడలేదు. ధైర్యంగా పోలీసుల ముందు నిల్చొని.. ఫొటోలకు ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల ఓ స్కూల్ బస్ డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించి, రాగ్ రూట్ లో యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇది చూసిన నెటిజన్స్ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చర్యకు ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. ఆ బస్ డ్రైవర్ కు చలాన్ విధించారు. అంతేకాకుండా అతనికి చలాన్ అందిస్తూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఘటన నెటిజన్స్ ను ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఫొటోపై తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు. ‘తప్పు చేసి చలాన్లు కడుతున్నా.. డ్రైవర్ ధైర్యానికి ఏం తక్కువ లేద’ని, ‘పోలీస్, డ్రైవర్ పోజ్ చూస్తుంటే.. ఏదో అవార్డ్ ఇస్తున్నట్లు గర్వంగా ఉంద’ని రాసుకొచ్చారు. మరికొందరు ‘ఆ పోజ్.. అప్పుడే అమ్మిన కొత్త బంతి తాళం తీసుకున్నట్లు ఉంద’ని, ‘మీలో ఎవరు కోటీశ్వరుడులో చక్ తీసుకుంటున్న కంటెస్టంట్ లా ఉన్నాడ’ని, ‘డైవర్ చేసిన తప్పును పాజిటివ్ గా తీసుకుంటున్నాడ’ని కామెంట్స్ పెడుతున్నారు.