దేశానికి ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహనీయుల స్మారకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నాణేలను విడుదల చేస్తుంటుంది. ఇటీవల నందమూరి తారకరామారావు జ్ఞాపకార్థం రూ. 100 నాణెం విడుదలై అత్యధికంగా అమ్ముడైన స్పెషల్ కాయిన్ గా రికార్డు సృష్టించింది. తాజాగా కేంద్రం మరో ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది. కృష్ణ భక్తురాలు, గాయక కవయిత్రి మీరాబాయి 525వ జయంతి సందర్భంగా రూ. 525 నాణేన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం యూపీలోని మథురలో విడుదల చేశారు.
శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన మీరా నాణెంతోపాటు ఆమె స్మృత్యర్థం తీసుకొచ్చిన పోస్టల్ స్టాంప్‌ను కూడా ఆవిష్కరించారు. కృష్ణుడు తిరుగాడిన వ్రజభూమికి రావడం తన అదృష్టమని అన్నారు. ‘‘మీరా జయంతి మన దేశ సంస్కృతని ప్రతిబింబించే ఉత్సవం. భారత్ మహిళాశక్తిని ఆధారించే దేశం. కష్ట సమయాల్లో మీరాబాయి వంటి సాధువులైన మహిళల ఆత్మస్థైర్యం మనకు మార్గదర్శనం చేస్తుంది’’ అని మోదీ కొనియాడారు. మీరా జన్మోత్సవ్ సందర్భంగా మధురతోపాటు పలు కృష్ణాలయాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.
#WATCH | Prime Minister Narendra Modi releases a commemorative stamp in honour of Sant Mira Bai, in Mathura, Uttar Pradesh pic.twitter.com/izDCY4iY09
— ANI (@ANI) November 23, 2023