ఎమ్మెల్యేను ప్రశ్నించిన జర్నలిస్ట్ పై దాడి....వీడియో వైరల్

Update: 2023-08-10 14:06 GMT

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే కిషోర్ పాటిల్ అనుచరులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన జర్మలిస్ట్‌పై దాడికి దిగారు. నడిరోడ్డుపైనే విచక్షణ రహితంగా చావబాదారు. అతడు కిందపడిపోయనా వదలకుండా చితక్కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జలగాన్‌ జిల్లా పచోరాలో చోటు గురువారం ఉదయం చోటు చేసుకుంది.

ఎనిమిదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో ఎమ్మెల్యే కిషోర్ పాటిల్‌ను ఓ సమావేశంలో సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు. అతడు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే ఇబ్బందికి గురయ్యారు. దీంతో సమావేశం అనంతరం ఆ జర్నలిస్ట్‌కు ఫోన్ చేసి బెదిరించారు. తమ నాయకుడిని ప్రశ్నించారని కక్ష పెంచుకున్న ఎమ్మెల్యే అనుచరులు గురువారం ఉదయం ఆ విలేకరిపై దాడి చేశారు. రోడ్డుపై వెళ్తుండగా అడ్డగించి మరి కొట్టారు. దాడి దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

Tags:    

Similar News