గాల్లో ఉండగా విమానం డోర్ ఓపెన్...రాజమండ్రి యువకుడు అరెస్ట్..!
విమానాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇటీవల వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. వారి చేష్టలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వారి ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగచూస్తుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ యువకుడు విమానంలో అనుచితం ప్రవర్తించాడు. ఫ్లైట్ గాల్లో ఉండగా వెనుక డోర్ తీయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశాడు. నిందితుడు రాజమండ్రికి చెందిన వెంకట్ మోహిత్ పత్తిపాటి (29) గా తెలుస్తోంది. జూలై 16 తెల్లవారుజామున ఈ ఘటన జరగ్గా, నిందితుడి చర్య తోటి ప్రయాణికుల్లో భయాందోళనకు గురి చేసింది.
వెంకట్ మోహిత్ ఫ్రాన్స్ విమానంలో ప్యారిస్ నుంచి బెంగళూరు బయల్దేరాడు. గమ్యానికి ఇంకా 4 గంటలు సమయం ఉంది. ఇంతలో అతను అకస్మాత్తుగా విమానం వెనుక ఎడమ వైపు ఉన్న తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారమందించారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937 మరియు ఐపిసి సెక్షన్ 336 ప్రకారం ఇతరుల ప్రాణాలకు మరియు భద్రతకు హాని కలిగించినందుకు వెంకట్ మోహిత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విమానం వెనుక డోర్ ఎందుకు తెరవడానికి ప్రయత్నించాడానికి గల కారణాలపై విచారించారు. అతని విద్యార్హతలు మరియు గత చరిత్రపై ఆరా తీసిన తర్వాత బెయిల్ మంజూరు చేశారు. పత్తిపాటి యుఎస్‌లో డేటా ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.