మోదీ కార్యక్రమంలో కిషన్ రెడ్డికి అవమానమంటూ వీడియో వైరల్!

Update: 2023-07-08 14:40 GMT

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారు. అయితే రాష్ట్ర కమిటీ చీఫ్ కిషన్ రెడ్డికి ఈ కార్యక్రమంలో అవమానం జరిగిందంటూ ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. బీఈఆర్ శ్రేణులు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తెలంగాణకు మోదీ ఇచ్చే గౌరవం ఇదీ అని, వారు ఢిల్లీ నేతలకు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని దుమ్మెత్తి పోస్తున్నాయి.

వీడియో ప్రకారం.. మోడీ రెడ్ కార్పెట్‌పై అటూ ఇటూ వేదపండితులు నడుస్తుండగా మధ్యలో నడుచుకుంటూ వెళ్లారు. ఇంతలో ఓ సెక్యూరిటీ గార్డు ఎడమవైపు వచ్చి పురోహితుల వెనక నడిచారు. దీంతో వారి వెనకున్న కిషన్ రెడ్డి కార్పెట్‌పై నుంచి కాకుండా పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లారు. అయితే సెక్యూరిటీ గార్డును కిషన్ రెడ్డిని పక్కకు నెట్టేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఇది అసత్య ప్రచారమని, కిషన్ రెడ్డే పక్కకు వెళ్లారని, కార్పెట్‌పై మోదీ తప్ప మరే నాయకుడూ లేరని అంటున్నాయి.

Tags:    

Similar News