80 ఏళ్ల బక్కవ్వకు సలాం.. రాఖీ కట్టడానికి ఎన్ని కి.మీ. నడిచిందంటే..

Byline :  Lenin
Update: 2023-08-31 08:33 GMT

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేం. నిత్యం జీవితంలో రోజూ చూసే దృశ్యాలు, రోజూ చూసే మామూలు మనుషులు నిమిషాల్లో మీడియాకు ఎక్కి ఆకర్షిస్తారు. ఇక సెంటిమెంట్ల వీడియోల సంగతి చెప్పాల్సిన పనిలేదు. హృదయాన్ని హత్తుకునే అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. తమ్ముడికి రాఖీ కట్టడానికి 80 ఏళ్ల అవ్వ 8 కి.మీ. దూరంలోని పల్లెకు నడుచుకుంటూ పోతున్న ముచ్చట గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన బక్కవ్వ అనే వృద్ధురాలు ‘రాకిట్ల పండగ’ చేసుకోవడానికి తమ్ముడు మల్లేశం ఉంటున్న ఊరికి వెళ్తూ ఓ నెటిజన్ కంటబడింది. ఎక్కడికి వెళ్తున్నామని అడగ్గా కొండయ్యపల్లికి వెళ్తున్నానని, అక్కడ తన తమ్ముడు, బంధువులు ఉన్నారని చెప్పింది. నడుచుకుంటూనే వెళ్తున్నానని చెప్పి ఆశ్చర్యపరిచింది. నెటిజన్ చిన్న మూటతో, రాఖీతో నడిచి వెళ్తున్న అవ్వను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టాడు. అంతవయసులోనూ తమ్మడిమీద ప్రేమతో వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా వెళ్తున్న అవ్వపై జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రక్తసంబంధానికి ఇది తిరుగులేని ఉదాహరణ అంటూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. కాళ్లు చెప్పులు లేకుపోయినా నడుస్తూ వెళ్తున్న అవ్వ ప్రేమకరు ఫిదా అవుతున్నారు.

Tags:    

Similar News