సోషల్ మీడియాలో ‘ఫస్ట్ నైట్ వీడియో’...ట్రెండింగ్

Update: 2023-06-24 16:52 GMT

పెళ్లి వీడియో సోషల్ మీడియోలో పెట్టడం కామన్..కానీ ఆ తర్వాత జరిగే ఫస్ట్ నైట్ వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టింది ఓ జంట. ఫేమస్ కావాలనే ఆత్రుతతో ఒక అడుగు ముందుకేసి.. తమ ఫస్ట్ నైట్ వీడియోను అప్లోడ్ చేసింది. దానికి ‘మా మొదటి రాత్రి ఇలా జరిగింది’ అని కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాలు వీడియోలు దర్శనమిస్తున్నాయి. తుమ్మినా, దగ్గినా వీడియో తీసి పెట్టేస్తున్నారు. షాపింగ్ చేసినా, డిన్నర్ కి వెళ్లినా, సినిమాకు వెళ్లినా, చివరి చావైనా...సందర్భం ఏదైనా కానీ ఫోటో లేదా వీడియో పెట్టాల్సిందే. అంతగా జనాలు సోషల్ మీడియాకు బానిసలైపోయారు. నలుగురిలో జరిగిన పనులు పంచుకోవడం వరకు ఒకే. కానీ కొందరు నాలుగుగోడల మధ్య ముద్దు ముచ్చట్లను కూడా షేర్ చేస్తున్నారు.

విషయానికొస్తే.. శృతి మహాజన్ అనే యువతి.. తమ ఫస్ట్ నైట్‌ ఇలా జరిగిందంటూ.. ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన భర్తతో ఏకాంతంగా ఉన్నమొదటి రాత్రి వీడియోను పెట్టింది. ఆ వీడియోలో భర్త, భార్యకు ముద్దులు పెట్టడం కనిపిస్తోంది. అతడి ఎదపై ఆమె వాలుతూ వీడియోను రికార్డు చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఫస్ట్ నైట్ వీడియో ఎవరైనా పెడతారా అని తిట్టిపారేస్తున్నార. ‘దీనికి సీక్వెల్ ఉంటుందా’ అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు.


https://www.instagram.com/reel/Crlt_RAo0u7/?utm_source=ig_web_copy_link


Tags:    

Similar News