మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ- కల్యాణ్ దేవ్ ల విడాకుల మ్యాటర్ గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఇరు కుంటుంబాలు నుండి ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. విడాకుల విషయం పక్కనబెడితే కల్యాణ్ దేవ్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ మాత్రం అతడి బాధని చెబుతోంది.
కల్యాణ్ దేవ్ ఆయన తల్లి పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆమెకు విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నేను మీకు రుణపడి ఉంటాను. మనమందరం కలిసి ఉన్నప్పుడే మీకు నిజమైన వేడుక అని నాకు తెలుసు! నిన్ను చాలా మిస్ అవుతున్నాను మై బేబీ నవిష్క’’ అంటూ రాసుకొచ్చాడు.
నవిష్క.. కల్యాణ్ దేవ్.. శ్రీజల కూతురు. ప్రస‍్తుతం ఆ చిన్నారి తల్లి శ్రీజ దగ్గరే ఉంటోంది. వారంలో ఓసారి అది కూడా నాలుగు గంటలు తండ్రి దగ్గరకి వస్తోంది. ఈ మధ్యే కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది. తాజాగా తల్లి పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న కళ్యాణ్.. . ఆమెకు విషెస్ చెబుతూ.. అందులో కూతురి గురించి చెప్పుకొచ్చాడు. 'మిస్ యూ మై బేబీ' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇది చూస్తుంటే.. ప్రతివారం నవిష్కని కలుస్తున్నాసరే కల్యాణ్ దేవ్ ఆమెని మర్చిపోలేకపోతున్నాడని అర్థమవుతోంది.