ఇంటర్నెట్లో వైరల్గా మారిన 1BHK టూర్.. (వీడియో)

Byline :  Kiran
Update: 2023-09-07 15:23 GMT

ముంబై.. ఇండియా ఫైనాన్షియల్ క్యాపిటల్. ఆకాశాన్నంటే భవనాలు, అద్భుత కట్టడాలు.. అర్థరాత్రి కూడా అద్భుతంగా కనిపించే నగరం. ఇదంతా నాణేనికి ఒకవైపు. మురికివాడలు, కాళ్లు చాపుకునేందుకు కూడా జాగా లేని ఇండ్లు మరోవైపు. దేశంలో ఖరీదైన నగరాల్లో ఒకటైన ముంబైలో పడుకునేంత జాగా ఉన్న గది కిరాయికి తీసుకోవాలనుకున్న రూ.10వేలకుపైగా చెల్లించాల్సిందే. అంత మొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చినా రూం దొరకడం కష్టమే.

ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఎటుచూసినా చిన్న చిన్న ఇండ్లు, ఇరుకిరుకు అపార్ట్మెంట్లు కనిపిస్తాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ హౌస్ టూర్ పేరుతో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అందులో సదరు యువకుడు సౌత్ బాంబేలోని 1BHK ఫ్లాట్ టూర్ చూపించాడు. ఆ ఫ్లాట్ రేటు కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే అని చెప్పాడు. అది చూసిన నెటిజన్లలో కొందరు ఆశ్చర్యపోతే.. మరికొందరి అయ్యో అంత చిన్న ఇంట్లో ఎలా ఉంటారని ఆశ్చర్యపోతున్నాడు.

సుమిత్ పాల్వే అనే వీడియో క్రియేటర్ పోస్ట్ చేసిన హోం టూర్లో వీడియోలో ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ చిన్న రూం ఉంది. అందులోనే ఒక బెడ్ ఉంది. ఆ రూం నుంచి లోపలికి వెళ్తే అక్కడో చిన్న కిచెన్ ఉంది. అందులోనే ఓ మనిషి నిలబడేంత చోటున్న అటాచ్డ్ బాత్రూం కనిపిస్తుంది. అక్కడి నుంచి పైకి వెళ్తే పైన చిన్న బాల్కనీ ఉన్న ఈ ఫ్లాట్ రేట్ కేవలం రూ.2.5కోట్లేనని, ఎవరు వచ్చినా చూపిస్తానని సుమిత్ పాల్వే చెప్పాడు.

సుమిత్ ఆజావో దిఖాదూంగా అనే క్యాప్షన్తో ఇన్స్టాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. సౌత్ బాంబే అంటే ఆ మాత్రం కాంప్రమైజ్ కావాల్సిందేనంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఇమిటేట్ చేసేలా ఉన్న వీడియోకు ఇన్స్టాగ్రాంలో ఇప్పటి వరకు లక్షకుపైగా లైక్స్ వచ్చాయి.


Tags:    

Similar News