ఆ స్కూల్లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్.. ఎందుకంటే

Update: 2023-06-05 12:49 GMT

స్టూడెంట్స్ లైఫ్ పాడవొద్దని టీచర్స్ చేసే సాహసాలు సినిమాల్లోనే చూసుంటాం. కానీ, కేరళలో నిజంగా అలాంటి ఘటనే జరిగింది. ఆ స్కూల్లో చదువుకుంటున్న ఒకే ఒక్క స్టూడెంట్ కోసం.. రోజూ 140 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది ఆ టీచర్. ఇతర రాష్ట్రాల్లో.. తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారని స్కూల్స్ను మూసేస్తుంటే.. కేరళలోని మాతోట్టులో మాత్రం కేవలం ఒక్క స్టూడెంట్ కోసం స్కూల్ను నడిపిస్తుంది అక్కడి ప్రభుత్వం. అతని కోసం ఓ టీచరమ్మ రోజుకు 140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

మారంగాడ్ అనే మారుమూల ప్రాంతంలో గిరిజన లోవర్ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఎస్పీ ప్రవీణ. ఆ స్కూల్లో సుఖిల్ ఒక్కడే చదువుతున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న సుఖిల్.. కుటుంబ కారణాలవల్ల గతేడాది స్కూల్కు మానేశాడు. అయినా పట్టువదలని ప్రవీణ.. సుఖిల్ కుంటుంబాన్ని ఒప్పించి, స్కూల్కు వచ్చేలా చేసింది. ప్రస్తుతం సుఖిల్ బాగానే చదువుతున్నాడు.

కొంత కాలంగా ఆ స్కూల్కు వచ్చే పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరికి అందులో ఒక్కరే మిగిలారు. దాంతో ప్రవీణ.. గిరిజన కుటుంబాలు వెళ్లి పిల్లలను చదివించాలని.. స్కూల్కు పంపిచాలని చాలాసార్లు కోరింది. అయితే, అక్కడికి వచ్చిన టీచర్లెవరూ పిల్లలను పట్టించుకోకుండా.. తరచూ లీవ్స్ పెట్టేవాళ్లని, దాంతో పిల్లలను స్కూల్లకు పంపించడం మానేశామని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. వాళ్లలో మార్పు తీసుకొచ్చి.. పిల్లలను చదివిస్తారని స్కూల్లో సుఖిల్ ఒక్కడే ఉన్నా 140 కిలో మీటర్లు ప్రయాణం చేసిమరీ వస్తుంది ప్రవీణ. ప్రస్తుతం ఎల్ కేజీలో 4 పిల్లలు జాయిన్ అయ్యారట. త్వరలో ఆ సంఖ్య పెరుగుతుందని ప్రవీణ విశ్వాసం వ్యక్తం చేస్తుంది.

Tags:    

Similar News