హైదరాబాద్ హైటెక్ సిటీలో రెండు భారీ బిల్డింగులను అధికారులు క్షణాల్లో కూల్చివేశారు. మైండ్ స్పేస్లోని ఈ భవనాలను క్షణాల వ్యవధిలో నేలమట్టం చేశారు. బిల్డింగుల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్న అనంతరం ఈ ప్రక్రియ పూర్తి చేశారు. భవనాలు రెండు పాతవి కావడంతో ఓనర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒక్కో భవనంలో ఆరు అంతస్తులు ఉన్నాయి. అవి పాతవై పోవడం ఆ స్థానంలో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి ఓనర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్ఐఐసీ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకున్న యజమానులు పక్క బిల్డింగులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేత బాధ్యతలను ఎడిపిక్ ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించారు. 10 సెకన్లలోనే మైండ్ స్పేస్ లోని రెండు బిల్డింగ్స్ నేలమట్టమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హైటెక్ సిటీ మైండ్ స్పేస్ లో రెండు బిల్డింగ్స్ ను కూల్చివేసిన అధికారులు.#Hyderabad #hitechcity #mindspace #buildings #IT #itemployees pic.twitter.com/ITenWbsQd3
— raghu addanki (@raghuaddanki1) September 23, 2023