జాతీయ జెండా ఎగరేసిన క్లింకారా.. కామెంట్స్ బాక్స్ ఫుల్

Update: 2023-08-16 03:17 GMT

రామ్ చరణ్, ఉపాసన కూతురు.. మెగా కుటుంబం వారసురాలు క్లింకారా (Klin Kaara) ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పెళ్ళైన 11 ఏళ్ళ తరువాత రామ్ చరణ్, ఉపాసనల జంట క్లీంకారకు ఆహ్వానం పలికారు. ఇక ఈ వారసురాలితో ఇటు నాయనమ్మ-తాతయ్య (సురేఖ-చిరంజీవి), అటు అమ్మమ్మ-తాతయ్య (శోభన-అనిల్) సంతోష సమయం గడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, నిన్న దేశ ప్రజలంతా 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో క్లింకారా కూడా పాల్గొన్నది.

కేవలం పాల్గొనడమే కాదు ఆ త్రివర్ణ పతాకాన్ని తన చేతులతో ఎగరవేసింది. తన అమ్మమ్మ-తాతయ్యతో కలిసి జెండా వందనం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా చేశారు. “క్లీంకార ఫస్ట్ ఇండిపెండెన్స్ డే విత్ అమ్మమ్మ-తాతయ్య. అమూల్యమైన క్షణాలు” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చరణ్ అండ్ ఉపాసన ఇప్పటి వరకు క్లీంకార పేస్ ని రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఉపాసన షేర్ చేసిన ఫొటోల్లో క్లీంకార పేస్ కొంచెం కనబడుతుంది. ఇక ఇది చూసిన మెగా అభిమానులు లవ్ సింబల్స్ తో కామెంట్స్ బాక్స్ ని నింపేస్తున్నారు.

జూన్ 20న రామ్ చరణ్ ఉపాసనలకు పండంటి బిడ్డ పుట్టింది. ఇక వారి కూతురికి క్లింకారా అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తల్లి అయిన తరువాత తనలో ఎంతో మార్పు వచ్చిందని, తన ప్రపంచమే మారిపోయిందని ఉపాసన గతంలో తెలిపారు. తల్లి అయిన తరువాతే మాతృత్వం గొప్పదనం అర్థమైందని, అందుకే ఒంటరి తల్లులకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తోందని, అందుకే సింగిల్ మదర్స్‌కు, పిల్లలకు ఉచితంగా చికిత్స అందించాలని, ఎలాంటి ఓపీ ఖర్చులు లేకుండా అపోలో తరుపున వైద్యం చేయిస్తానని ఉపాసన ప్రకటించారు కూడా.


Tags:    

Similar News