Viral Video : ఫ్రెష్గా ఉండాలని.. కొబ్బరి కాయలపై మురికి నీళ్లు చల్లుతున్నడు.. ఎక్కడంటే

Update: 2023-06-06 12:46 GMT

ఈ వ్యక్తి చేసిన పని ప్రతి ఒక్కరికి ఆగ్రహం తెప్పిస్తుంది. జనాలు.. హెల్త్ బెనిఫిట్స్ కోసం ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల రసాల బాట పడుతుంటే.. ఇతని లాంటి వాళ్ల వల్ల ఆరోగ్యాలు మరింత చెడిపోతున్నాయి. ఫ్రెష్ గా కనిపించడం కోసం.. కెమికల్స్ కలపడం చూసుంటాం. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని సమీర్ అనే వ్యక్తి.. మురికి కాలువలో ఉన్న నీళ్లను చల్లుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

సమీర్ కొబ్బరి బోండాలు అమ్ముతుంటాడు. ఎండవల్ల కొబ్బరి బోండాలు తాజాదనం కోల్పోతున్నాయని.. పక్కనే ఉన్న మురికి కాలువలోని నీళ్లు వాటిపై చల్లుతాడు. అది పక్కన ఓ కార్లో ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. డబ్బుకోసం జనాల ప్రాణాలతో ఆడుకుంటావా.. అంటూ నెటిజన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీర్ ను అరెస్ట్ చేసి.. సెక్షన్ 270 కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News