చూస్తేనే గుండె గుభేల్.. ఇక అక్కడికి వెళ్తేనా... వీడియో వైరల్
సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నడూ చూడని అరుదైన దృశ్యాలు చూస్తున్నాం. కొన్ని కనువిందు చేస్తే కొన్ని గుడెను ఝల్లుమనిపిస్తాయి. ఏ మారుమూలో ఉండే జీవజాలం, ఘోరమైన ప్రమాదాలు, వింతవింత ప్రదేశాలు మరెన్నో ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి ఫ్లాట్‌ఫామ్‌ల మీద హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ మొసళ్ల నది వీడియో చూసేవారి గుండెల్లో మొసళ్లను పరిగెత్తిస్తోంది. ఆఫ్రికాలోని ఓ నదిలో తీసినట్లు భావిస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. భూలోకంలో నరకలోకమని, అసలు అక్కడికి ఆ పడవలో వెళ్లాల్సిన అవసరం ఏమిటని నెటిజన్లు కామెంటుతున్నారు. పడవ నుంచి ఏమాత్రం పట్టు తప్పి పడిపోయినా ఎముక కూడా మిగలదని అంటున్నారు.
39 సెకెన్ల ఈ చిన్న వీడియోలో ఓ చేపల పడవ వాగులో వెళ్తుంటుంది. వాగులోని నల్లని మొసళ్లు భయపడి ఒడ్డుకు పరుగులు తీస్తుంటాయి. ఒకేచోట వందలాది మొసళ్లు అటూ ఇటూ పరుగెడుతుంటే పడవ ముందుకే వెళ్తున్నాయి. మొసళ్లు కొరమీనుల్లా పెద్ద సంఖ్యలో ఒకచోట పడి ఉండడంతో ఈ వీడియో భయం పుట్టిస్తోంది.