ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతికి ఏ క్షణాన వెళ్లిందో కానీ.. దాని రూపురేకలన్నీ మారిపోతున్నాయి. మొదట యాప్ లో మార్పులు, సంస్థ ఉద్యోగుల తొలగింపుల తర్వాత.. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ పక్షిని ఎగరగొట్టి ఎక్స్ అనే పేరును తీసుకొచ్చాడు. దీనిపై చర్చ సాగుతోంది. కొందరు మస్క్ ను తిడుతూ పోస్ట్ లు పెడుతున్నారు. అదే సమయంలో మరో కొత్త టాపిక్ చర్చల్లోకి వచ్చింది. భారతీయ రైల్వే తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో రైలు బోగీ వెనకాల పసుపు రంగు ఎక్స్ అనే సింబల్ ఫొటోలను షేర్ చేశారు. దీంతో నెటిజన్స్ ‘రైలు బోగి Xకు.. ట్విట్టర్ Xకు ఏదో సంబంధం ఉందని అనుకుంటున్నారు.
ప్రతీ రైలు కంపార్ట్ మెంట్ చివరి బోగీపై ఎప్పుడూ ఎక్స్ అనే పసుపు రంగు సింబల్ ఉంటుంది. అది రైలు పూర్తిగా స్టేషన్ దాటేవరకు కనిపించడు. ఈ గుర్తుకు అర్థం ఏంటో తెలుసా? అని రైల్వే బోర్డ్ నెటిజన్స్ ను ప్రశ్నించింది. దాని సమాధానం కోసం నెట్ లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ రైలు బోగీ వెనకాల ఉండే ఆ ఎక్స్ సింబల్ ఏంటంటే... ఎక్స్ అనే పసుపు రంగు సింబల్ ఉంటే అదే రైలు చివరి కోచ్ అరి అర్థం. ఆ కోచ్ వెనకాల ఏ కోచ్ మిగిలిపోలేదనడానికి గుర్తు అది. అంతేకాకుండా.. రైలు స్టేషన్ ను పూర్తిగా దాటి పోయింది అనడానికి సూచన ఆ గుర్తు. ఈ విషయం తెలుపుతూ.. ఎలన్ మస్క్ ఎక్స్ సింబల్ కు.. రైలు బోగా ఎక్స్ సింబల్ కు ఏం సంబంధం లేదని స్పష్టం చేసింది.
The 'X' factor of #IndianRailways
— South Western Railway (@SWRRLY) July 24, 2023
Do you know what the X sign on the coach means? #TwitterX #TheX pic.twitter.com/wjJ0o2W4Z0